బూర్గంపహాడ్, జూన్ 19 : రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న లారీని బూర్గంపహాడ్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూర్గంపహాడ్ మార్కెట్ యార్డు సమీపంలో సాధారణ తనిఖీలు చేపడుతుండగా లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేట నుండి చత్తీస్ఘడ్ రాష్ట్రానికి ఈ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లుగా గుర్తించి సుమారు 28 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.