హైదరాబాద్: డయల్-100కు వచ్చిన అత్యవసర సమాచారంపై చైతన్యపురి పెట్రోల్ మొబైల్-1 పోలీసులు కేవలం నాలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని నాలుగు ప్రాణాలను కాపాడారు. డబ్ల్యూపీసీ ఎం. చంద్రకళ, హోంగార్డ్ జె. బాలరాజు హైడ్రా బృందంతో కలిసి ముసీ నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళతో పాటు ఆమె ముగ్గురు చిన్నారులను సురక్షితంగా రక్షించారు.
అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో స్పందించి నాలుగు ప్రాణాలను కాపాడిన చైతన్యపురి పోలీసులను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అభినందించారు.