ఐటీసీలో ప్రమాదం… లారీ డ్రైవర్ మృతి
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో మంగళవారం లారీ ఫైర్ పైపులైనుకు తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మెడకు తీవ్రగాయాలై మృతిచెందగా మరో ఇద్దరు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఉదయం లక్ష్మీపురం గ్రామానికి చెందిన..
– ఐటీసీ గేటు ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
బూర్గంపహాడ్, ఏప్రిల్ 21 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో మంగళవారం లారీ ఫైర్ పైపులైనుకు తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మెడకు తీవ్రగాయాలై మృతిచెందగా మరో ఇద్దరు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఉదయం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ ట్రాన్స్‌పోర్టులో ముసలిమడుగుకు చెందిన తంబి(50) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లారీలో పల్ప్ మెటీరియల్ తీసుకుని ఐటీసీలోని పల్ప్ యార్డులో అన్లోడింగ్ చేసుకుని తిరిగి బయటి వర్క్‌కు సంబంధించి వెళ్తుండగా లారీ యార్డు సమీపంలో ఉన్న ఫైర్ పైపులైనుకు లారీ బలంగా తగిలి పూర్తిగా మెల్ట్ అయింది. దీంతో ప్రధాన పైపు పగిలిపోవడంతో ఈ సంఘటనలో డ్రైవర్ కిందపడిపోవడంతో పైప్‌లైన్‌కు సంబంధించిన పైపు మెడభాగంలో తగలడంతో తెగిపోయింది.
సమాచారం అందుకున్న సెక్యూరిటీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్‌లో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ తంబిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే భద్రాచలం వెళ్లే మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఫైర్ పైపులైను పగిలిపోవడంతో ఉవ్వెత్తున నీరు ఎగిసిపడటంతో ఆ నీరంతా ఐటీసీ పక్కనే ఉన్న గోడ నుండి సారపాకలోని పలు వీధుల్లోకి వచ్చి చేరింది. అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఫైర్ పైపులైను కనెక్షన్ ఆపడంతో ఎగిసిపడిన నీటి ఉధృతం తగ్గింది.
ఐటీసీ గేటు ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
ఫైర్ పైపులైను పగలి ప్రమాదంలో మృతి చెందిన తంబి కుటుంబ సభ్యులు ఐటీసీ గేటు వద్ద మంగళవారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. తమ కుటుంబానికి ఐటీసీ యాజమాన్యం పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. సమాచారం తెలుసుకున్న ఐటీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

ఐటీసీలో ప్రమాదం… లారీ డ్రైవర్ మృతి
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

