– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా
– ఈ నెల13లోపు దరఖాస్తుకు అవకాశం
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 01 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ట్రాన్స్జెండర్స్కి ఆర్ధిక పునరావాస పథకం కింద ఒక్కొక్క యూనిట్కి రూ.75 వేల చొప్పున మొత్తం 8 యూనిట్లకు వంద శాతం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. జిల్లాలోని అర్హులైన ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ wdsc.telangana.gov.in వెబ్ సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ చేసుకుని సంబంధిత అన్ని ధృవ పత్రాలతో దరఖాస్తుని ఈ నెల 13 లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, కలెక్టరేట్ కాంప్లెక్స్, రూమ్ నెంబర్ G- 1 నందు సమర్పించాలన్నారు. వివరాలకు 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
1. ట్రాన్స్జెండర్కి కలెక్టర్ లేదా జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన గుర్తింపు పత్రం, గుర్తింపు కార్డు ఉండాలి
2. వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి
3. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు
4. అభ్యర్ధులు గత (5) సంవత్సరాలలో వికలాంగుల సంక్షేమ శాఖ నుండి గానీ, మరే ఇతర శాఖ నుండి గానీ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి గానీ సబ్సిడీని పొంది ఉండకూడదు
5. ఒక కుటుంబానికి (5) సంవత్సరాలలో కేవలం ఒక స్వయం ఉపాధి పథకానికి మాత్రమే పరిమితం చేయబడుతుంది
6. ఈ పథకాన్ని పొందిన లబ్దిదారులు తదుపరి (5) సంవత్సరాల వరకు అటువంటి పథకం కింద ఏ ప్రయోజనానికి అర్హులు కారు
7. సాంకేతిక అర్హతలు ఉన్న, సంబంధిత కార్యకలాపాల్లో గణనీయమైన అనుభవం ఉన్న అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
8. ఏదైనా యూనిట్ కోసం శిక్షణ పొందిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
9. విద్యార్హత పత్రములు ఏవైనా, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.