కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 14 : సమాజంలో మనమంతా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతా లక్ష్మి, వన్ టౌన్, త్రి టౌన్ సీఐలు కరుణాకర్, శివప్రసాద్ అన్నారు. సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నమని అన్నారు. అనంతరం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనుకుంట్ల శ్రీనివాస్, తలుగు అశోక్, బత్తుల శ్రీనివాస్, పరమేష్, సూరజ్, శ్రీధర్, అరుణ్, శివ, హైమధ్, కోసున వాసు, శ్రీరామ్, కిం కుమార్, నిజాం, కన్ని, బాచి, రమాకాంత్, శ్రీకాంత్ , అమరేంధర్ , అణుదీప్ పాల్గొన్నారు.
Kothugudem : స్వేచ్ఛగా బతుకుతున్నమంటే అంబేద్కర్ చలువే : కాపు సీతాలక్ష్మి