రామవరం, ఆగస్టు 25 : పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని జీఎం కార్యాలయం నందు ఉద్యోగులకు వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులందరూ మట్టి వినాయక విగ్రహ ప్రతిమలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకుని, వినాయక చవితి పండుగను జరుపుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ యూనియన్ సెంట్రల్ కౌన్సెల్లింగ్ మెంబర్ షైక్. హుమాయూన్, ఐఎన్టియూసి యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఎస్ ఓ టు జి ఎం జి.వి.కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏజీఎం (ఫైనాన్స్) కె.సుమలత, ఏజీఎం (సివిల్) సిహెచ్.రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డిజిఎం (ఐఈ ) ఎన్.యోహన్, ఇతర విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.