భద్రాద్రి కొత్తగూడెం. ఏప్రిల్ 23 : కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగేలా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కొత్తగూడెం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివెళ్దామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ అన్నారు. బుధవారం లక్ష్మీదేవిపల్లిలో పార్టీ మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు నివాసంలో మండల ముఖ్య కార్యకర్తలు సమావేశం జరిగింది. సమావేశానికి వనమా రాఘవ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణకు రక్ష అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, హామీలను తుంగలో తొక్కి మాటల గారడీలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉర్దుఘర్ చైర్మన్ అన్వర్ పాషా, సర్పంచ్ తాడూరి రజాక్, మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్, కనకరాజు, కోళ్ల మోహన్, టీ టైప్స్ మునీర్, రాజవరపు మురళి, బద్రు, బాలు, రాధాకృష్ణ, పొదిలి వెంకటాచలం, ఎర్రబడి శీను, చెర్ర వెంకన్న, శ్రీకాంత్ నాయక్, పెంచాల సంపత్, బాలకృష్ణ, సురేశ్, లావుడియా వెంకటేశ్, తరాల దాము, కొంపల్లి వెంకన్న, పూర్ణాచారి, లావుడ్య ప్రసాద్, హోలీతండ రాజు, ఎదురుగడ్డ సురేశ్, మెరుపు రమేశ్, మెకానిక్ సురేశ్, శ్రీను, పొగాకు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.