రామవరం, అక్టోబర్ 25 : మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శనివారం చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం అవగాహన కార్యక్రమంలో భాగంగా టూ టౌన్ పరిధిలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్ధాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలను సేవిస్తే శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా ఎదురయ్యే సమస్యలు, చట్టాల ద్వారా పడే శిక్షలను వివరించారు. అసాంఘిక కార్యకలాపాలు గానీ, వ్యక్తుల సమాచారం గానీ తెలిస్తే స్థానిక పోలీసులకు గానీ, 100 నంబర్‌కు డయల్ చేసి తెలుపాలన్నారు. జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్న పోలీస్ శాఖకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మనీషా, ఏఎస్ఐ ఝాన్సీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Ramavaram : మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం : సీఐ ప్రతాప్