రామవరం, జూలై 12 : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు జవాబుదారితనం పాటించేలా తయారు చేయాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. శనివారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ధన్బాద్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల అప్పగింత (ఇన్వెస్టిచర్ సెర్మనీ)పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అంకితభావం, చిత్తశుద్ధితో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలన్నారు.
ప్రపంచానికి నైతికత, దూరదృష్టి కలిగిన నాయకత్వం అవసరమన్నారు. అనంతరం స్కూల్ పీపుల్ లీడర్ (విద్యార్థి, విద్యార్థిని) క్లబ్ జనరల్ సెక్రెటరీ, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు (గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ) గ్రూపుల కెప్టెన్లను ఎన్నుకోగా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ జేరో మియాస్, బ్రదర్ దయాబాన్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Ramavaram : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి : సీఐ ప్రతాప్