రామవరం, ఆగస్టు 1 : కార్మిక సంక్షేమమే ఏఐటీయూసీ జెండా, ఎజెండా అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 గని వద్ద ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి హుమాయూన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. జేఎంఈటీ నియామకం సమయంలో ఒక సంవత్సరంలో సర్టిఫికెట్ సమర్పించని వారిని యాజమాన్యం తొలగించిందని, ఈ సమస్యపై గత నెల 24న ఆర్ఎల్సీలో చర్చించామని, వారికి త్వరలోనే నియామక ఉత్తర్వులు లభిస్తాయని తెలిపారు.
గతంలో కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందేది కాదని, కానీ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత యాజమాన్యంతో, బ్యాంకులతో చర్చించి, ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.1.20 కోట్లు వచ్చేలా సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశామని, దీనికి కూడా సానుకూలంగా స్పందన వచ్చిందని వెల్లడించారు. ఇది ఏఐటీయూసీ కృషి ఫలితమే అని పేర్కొన్నారు.
యూనియన్ చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై పీవీకే 5 గనిలో పలువురు యువ కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. యూనియన్ యువ కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, సివిల్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్, పిట్ వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సాయి పవన్, వీ కే వర్క్ షాప్ పిట్ కార్యదర్శి మధు కృష్ణ, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి కమల్, బుక్య రమేశ్, కుర్ర రమేశ్, బివి రమణ, సందీప్, శ్రీనాథ్, ప్రసాద్, శ్రీధర్, సతీశ్, మహేశ్, ఆఫీస్ బేరర్ సందబోయిన శ్రీనివాస్, కె.రామచందర్, నారాయణ, ఎస్. రమేశ్, గంగారాం, విక్రమ్, సంజయ్, సోమేశ్, సుభాశ్, క్రాంతి, వి.సుమన్, ధర్మారావు, రవి, అక్బర్ బాషా, మధు, మనీష్, శ్రీనివాస్, తరాల బాబురావు, సుధాకర్, పుష్ప, రోహిత్, జానీ, ఎల్ రామచందర్, సంతానం పీవీకే గని కార్మికులు పాల్గొన్నారు.
Ramavaram : కార్మిక సంక్షేమమే ఏఐటీయూసీ ఎజెండా : కొరిమి రాజ్‌కుమార్