కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని ప్రస్తుత తరుణంలో కూలీలు వీబీ జీ రామ్ జీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో నాగలక్ష్మి అన్నారు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ మేట్లకు ఏర్పాటు చేసిన రెండో రోజు శిక్షణా కార్యక్రమంలో శనివారం ఆమె ముఖ్య అతిథిగా...
జూలూరుపాడు, అక్టోబర్ 31 : గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని ప్రస్తుత తరుణంలో కూలీలు వీబీ జీ రామ్ జీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో నాగలక్ష్మి అన్నారు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ మేట్లకు ఏర్పాటు చేసిన రెండో రోజు శిక్షణా కార్యక్రమంలో శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాల దృష్ట్యా భవిష్యత్‌లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కలిగే నష్టాలను ముందుగానే నివారించేందుకు అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
నీటి సంరక్షణలో భాగంగా రైతులు తమ పొలాల్లో తప్పనిసరిగా పంట కుంటలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న అంశాలను మేట్లు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఉపాధి పనుల కల్పనలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఉపాధి కూలీలు చేసిన పనికి సరైన కొలతలు నమోదు చేసి, వారికి ప్రభుత్వం నిర్దేశించిన రోజువారీ గరిష్ట వేతనం రూ.308 అందేలా చూడాల్సిన బాధ్యత మేట్లదేనని స్పష్టం చేశారు. గ్రామాల్లో మరింత ఎక్కువ సంఖ్యలో కూలీలు పనులకు వచ్చేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో తులసీరామ్, ఏపీవో రామారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

