‘కోయగూడెం ఓసీ-3ను సింగరేణి సంస్థ ద్వారానే నిర్వహించాలి’
కోయగూడెం ఓసీ-3 బొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం బోడు సెంటర్లో సోమవారం సుమారు నాలుగు గంటల పాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
– ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఉద్యమం తప్పదు
– సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
టేకులపల్లి, నవంబర్ 16 : కోయగూడెం ఓసీ-3 బొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం బోడు సెంటర్లో సోమవారం సుమారు నాలుగు గంటల పాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ.. సింగరేణి అనేది కేవలం బొగ్గు గనుల సంస్థ మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు. లక్షలాది మంది కార్మికుల చెమట, రక్తం, ప్రాణ త్యాగాలతో నిర్మితమైన సింగరేణి సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
ప్రైవేటీకరణతో కార్మికుల ఉద్యోగ భద్రత దెబ్బతినడంతో పాటు వేతనాలు, సౌకర్యాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరిగి శాశ్వత ఉద్యోగాల కల్పనకు అవకాశం లేకుండా పోతుందన్నారు. కోయగూడెం ఓసీ-3ను సింగరేణి సంస్థే నిర్వహించాలని, సింగరేణి కార్మికులే బొగ్గు తవ్వాలని, తద్వారా వచ్చే లాభాలు ప్రజలకు, సంస్థ అభివృద్ధికి ఉపయోగపడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ టెండర్లను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున సమ్మెకు, ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. సారయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రేసు ఎల్లయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్, ఇల్లందు పట్టణ, మండల కార్యదర్శులు బాస శ్రీనివాస్, బొబ్బిశెట్టి సత్యనారాయణ, వజ్జా చిరంజీవి, ఇమాయిల్, పగడయ్య, టేకులపల్లి మండల కార్యదర్శి గుగులోత్ రాంచందర్, మాజీ మండల కార్యదర్శి ఉడుత ఐలయ్య, ఉపసర్పంచ్ కాసిం, జక్కుల కనకయ్య, యాదగిరి, భాస్కర్, శరత్, జయరాజు, మాలోత్ హరిసింగ్, యు. రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, రాంబాబు, సోమరాజు, బిక్షపతి, ఆర్. నరసయ్య, కె. సారయ్య, డాక్టర్ రమేష్ బాబు, సాయి, లింగమూర్తి, గుగులోత్ సోని పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోయగూడెం ఓసీ-3ను సింగరేణి సంస్థ ద్వారానే నిర్వహించాలి’
Bilkis Bano case | బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్..!
Mother Beats Daughter To Death | పూజకు ముందే ప్రసాదం తిన్నందుకు కుమార్తెను కొట్టిన తల్లి.. ఆ చిన్నారి మృతి
‘రైతుల ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
Lashkar Terrorist: లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతం
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

