Bilkis Bano case | బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్..!
Bilkis Bano case | బిల్కిస్ బానో కేసు (Bilkis Bano case) లో దోషులుగా తేలిన వారిలో ఇద్దరికి సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఆ ఇద్దరు వ్యక్తులకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను నిలిపివేసి బెయిల్ ఇచ్చింది. ఆ ఇద్దరు ఇప్పటికే 17 ఏళ్లకుపైగా జైలులో గడిపారని, వారి అప్పీలులో పరిగణనలోకి తీసుకోవాల్సిన వాస్తవ, చట్టపరమైన అంశాలు ఉన్నాయని కోర్టు పేర్కొన్నది.
Bilkis Bano case : బిల్కిస్ బానో కేసు (Bilkis Bano case) లో దోషులుగా తేలిన వారిలో ఇద్దరికి సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఆ ఇద్దరు వ్యక్తులకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను నిలిపివేసి బెయిల్ ఇచ్చింది. ఆ ఇద్దరు ఇప్పటికే 17 ఏళ్లకుపైగా జైలులో గడిపారని, వారి అప్పీలులో పరిగణనలోకి తీసుకోవాల్సిన వాస్తవ, చట్టపరమైన అంశాలు ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. 2017 మే నెలలో బాంబే హైకోర్టు (Bombay High Court) వారికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.
అయితే ఆ తీర్పును సవాల్ చేసిన దోషులు బిపిన్చంద్ జోషి, ప్రదీప్ మోధియాలకు అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది. వారికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్స్లో ఒకరైన జోషి తీవ్రమైన వైకల్యంతో ఉన్నారనే విషయాన్ని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అయితే నేరాల తీవ్రతను, ట్రయల్ కోర్టు, హైకోర్టుల ఏకగ్రీవ తీర్పులను ఉటంకిస్తూ ప్రభుత్వ తరఫు న్యాయవాది కేసు విచారణ సందర్భంగా దోషుల బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించారు.
అయితే దోషుల తరఫు న్యాయవాది పిటిషనర్స్లో ఒకరి పేరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులో లేదని, నేరం జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గత విచారణల సందర్భంగానూ, అత్యాచార ఆరోపణలపై బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ, వైద్య పరీక్షల సమయంలో డాక్టర్ ముందు నమోదు చేసిన వాంగ్మూలంలోనూ ఆ ఇద్దరు పిటిషనర్ల పేర్లను పేర్కొనలేదని డిఫెన్స్ లాయర్ వెల్లడించారు. ఆ ఇద్దరికి కేసుతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఆపాదించబడలేదని, ఘటన జరిగిన సమయంలో వారు గుంపులో ఉండి ఉండవచ్చనేది మాత్రమే వారికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక సాక్ష్యమని తెలిపారు.
కాగా గతంలో బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన 11 మందికి శిక్ష తగ్గించి విడుదల చేశారు. బిల్కిస్ బానో ఈ శిక్షా తగ్గింపును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దాంతో శిక్షను తగ్గించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొన్న కోర్టు.. దోషులైన 11 మందిని రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. దాంతో దోషులు లొంగిపోయారు. అలా లొంగిపోయిన వారిలో ఇప్పుడు బెయిల్ పొందిన ఇద్దరు కూడా ఉన్నారు. కాగా బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె వయస్సు 21 ఏళ్లు. అప్పుడు ఆమె ఐదు నెలల గర్భిణి కూడా. నాగు ఆమె కుటుంబసభ్యులలో ఏడుగురు హత్యకు గురయ్యారు. వారిలో బిల్కిస్ మూడేళ్ల కుమార్తె కూడా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bilkis Bano case | బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్..!
Mother Beats Daughter To Death | పూజకు ముందే ప్రసాదం తిన్నందుకు కుమార్తెను కొట్టిన తల్లి.. ఆ చిన్నారి మృతి
‘రైతుల ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
Lashkar Terrorist: లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతం
NIMS Staff | హరీశ్ రావు సార్ ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

