Mother Beats Daughter To Death | పూజకు ముందే ప్రసాదం తిన్నందుకు కుమార్తెను కొట్టిన తల్లి.. ఆ చిన్నారి మృతి
Mother Beats Daughter To Death | ప్రసాదం కోసం తయారు చేసిన ఆహార పదార్థాన్ని పూజకు ముందే ఒక చిన్నారి తిన్నది. ఆగ్రహించిన తల్లి, తన కుమార్తెను కొట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక మరణించింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పాట్నా: ప్రసాదం కోసం తయారు చేసిన ఆహార పదార్థాన్ని పూజకు ముందే ఒక చిన్నారి తిన్నది. ఆగ్రహించిన తల్లి, తన కుమార్తెను కొట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక మరణించింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Mother Beats Daughter To Death) బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఛఠ్ పూజలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లల శ్రేయస్సుతో పాటు సౌభాగ్యం, దీర్ఘాయువు కోసం ఈ పూజను ఆచరిస్తారు.
కాగా, ఆదివారం రీనా కుమారి అనే మహిళ ఛఠ్ పూజ కోసం నైవేద్య పదార్థాలను సిద్ధం చేస్తున్నది. నాలుగేళ్ల కుమార్తె సుహాని కుమారి, ప్రసాదం కోసం తయారు చేసిన ఒక ఆహార పదార్థాన్ని తిన్నది. ఆగ్రహించిన తల్లి రీనా ఆ చిన్నారిని కొట్టింది. ఆ వెంటనే ఆ బాలిక ఆరోగ్యం క్షీణించింది. ఆ చిన్నారిని చికిత్స కోసం ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు సుహాని అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కుమార్తె మరణానికి కారణమైన ఆ చిన్నారి తల్లి రీనాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత, పోలీస్ విచారణ పూర్తయ్యాక ఆ చిన్నారి మరణానికి కారణం ఏమిటన్నది స్పష్టమవుతుందని పోలీస్ అధికారి తెలిపారు.
అయితే ఛఠ్ పూజ రోజున కుమార్తెను కోల్పోవడంపై ఆ చిన్నారి తండ్రి రాజు పాశ్వాన్ తీవ్ర వేదనకు గురయ్యాడు. తన కుమార్తె లేని ఈ పండుగకు ఇక ఎలాంటి అర్థం లేదని వాపోయాడు. తన భార్యకు కఠిన శిక్ష పడాలని అతడు డిమాండ్ చేశాడు. తన జీవితంలో ఆమె అవసరం లేదన్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలను తానే స్వయంగా పెంచుకుంటానని అతడు చెప్పాడు.
కాగా, రాజు పాశ్వాన్, రీనా కుమారి దంపతులకు ముగ్గురు పిల్లలు. ఏడేళ్ల శివానీ కుమారి, నాలుగేళ్ల సుహాని కుమారి, ఏడాదిన్నర వయసున్న రాజా కుమార్ ఉన్నారు. అయితే రెండో కుమార్తె సుహాని మరణంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- Beats Up
- Bihar
- Chhath Puja
RELATED ARTICLES
తాజా వార్తలు
Bilkis Bano case | బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్..!
Mother Beats Daughter To Death | పూజకు ముందే ప్రసాదం తిన్నందుకు కుమార్తెను కొట్టిన తల్లి.. ఆ చిన్నారి మృతి
‘రైతుల ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
Lashkar Terrorist: లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతం
NIMS Staff | హరీశ్ రావు సార్ ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

