‘రైతుల ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఘోరంగా విఫలమైందని, మాటల గారడీలతో కాలయాపన చేస్తోందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో...
– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
– గుడిపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరిక
దేవరకొండ, నవంబర్ 16 : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఘోరంగా విఫలమైందని, మాటల గారడీలతో కాలయాపన చేస్తోందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గుడిపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు, విమర్శలు పక్కనపెట్టి ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రైతాంగం సగౌరవంగా జీవించిందన్నారు. 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు, సకాలంలో యూరియా, ఎరువుల పంపిణీ, పంట వేయగానే రైతు బంధు సాయం, ధాన్యం కొనుగోళ్లలో పకడ్బందీ వ్యవస్థతో రైతులకు అండగా నిలిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని కొనియాడారు.
అయితే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక, యూరియా సకాలంలో దొరక్క, పండించిన ధాన్యాన్ని విక్రయించుకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రభుత్వ మెడలు వంచి కేసీఆర్ హయాంలో అమలైన రైతు సంక్షేమాన్ని తిరిగి సాధించుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. రైతుల కడుపు మండితే ఉవ్వెత్తున ఎగిసిపడే ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.
కాంగ్రెస్ చేతిలో మోసపోయామని భావిస్తున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి, రైతు సంక్షేమం మళ్లీ పూర్వ వైభవం పొందాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్కు ఎప్పుడు ఓటు వేసి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్లుగురి వల్లపు రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ, సర్పంచులు కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైనబోయిన శ్రీను, దూదిపాల రాజేందర్ రెడ్డి, తోటకూరి పరమేష్, ఎర్ర యాదగిరి, బొడ్డుపల్లి మహేందర్, బొగది కృష్ణారెడ్డి, అనిల్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమావత్ రవి, గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు రమావత్ యాదగిరి, వార్డు సభ్యులు రమావత్ నాగు, జటావత్ అచ్చి, రమావత్ హనుమంత్, నాయకులు రామావత్ భగవాన్, భాస్కర్, అనిల్, బాల్ సింగ్, రమేష్, మూడవతు రెడ్డి, రమావత్ రమేశ్, వెంకట్రామ్, దేవ్ సింగ్, బాలు నాయక్, భిక్షం, మోతీలాల్, దానవత్ సాంబ, రమావత్ ముఖేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతుల ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
Lashkar Terrorist: లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతం
NIMS Staff | హరీశ్ రావు సార్ ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగి
తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు.. పట్టించుకోని సింగరేణి అధికారులు
‘అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

