– బాలుర ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం
రుద్రంపూర్, ఫిబ్రవరి 04 : జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో (SLIPSGM 2025–26) ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల నుండి పాల్గొన్న జట్ల మధ్య జరిగిన పోటీల్లో కొత్తగూడెం జట్టు పలు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి విజయ ఢంకా మోగించింది.
ఈ పోటీల్లో
బాలుర బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ప్రథమ స్థానం
బాలుర టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ప్రథమ స్థానం
బాలుర టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో ప్రథమ స్థానం
బాలుర డిస్క్ త్రోలో ప్రథమ స్థానం
బాలికల టేబుల్ టెన్నిస్‌లో తృతీయ స్థానం
బాలుర 4×400 మీటర్ల రిలేలో తృతీయ స్థానం సాధించారు.
అంతేకాకుండా మొత్తం ప్రదర్శన ఆధారంగా బాలుర ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కొత్తగూడెం పాలిటెక్నిక్ జట్టు కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను, ఫిజికల్ డైరెక్టర్ కృష్ణారావు, ఎలక్ట్రికల్ విభాగాధిపతి తారాసింగ్, లెక్చరర్లు స్వప్న, కృష్ణ, ధరణి, స్టాఫ్ సందీప్, కౌసల్యను కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో విద్యార్థులు మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి క్రీడల్లో కొత్తగూడెం పాలిటెక్నిక్ సత్తా