– అధ్యక్షుడిగా యాకూబ్ పాషా
రుద్రంపూర్, ఏప్రిల్ 08 : తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని కొత్తగూడెంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రహనుమా-ఏ-దక్కన్ జాతీయ దినపత్రిక కొత్తగూడెం జిల్లా బ్యూరోగా పనిచేస్తున్న ఎండీ.యాకూబ్ పాషా, ఉపాధ్యక్షుడిగా రహనుమా-ఏ-దక్కన్ కొత్తగూడెం నియోజకవర్గ రిపోర్టర్ ఎండీ.జలీల్, ప్రధాన కార్యదర్శిగా మున్సిఫ్ ఉర్దూ చానల్ జిల్లా రిపోర్టర్ ఉప్పల్, సహాయ కార్యదర్శిగా మున్సిఫ్ పత్రిక రిపోర్టర్ ఎండీ రఫీ, కోశాధికారిగా మాజీద్ ఖురేషి, సభ్యులుగా ఎండీ అన్వర్, ఎంఏ నయీమ్ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను ఖమ్మం నుండి వచ్చిన టీయూడబ్ల్యూజేయూ జిల్లా అధ్యక్షుడు షేక్ అహద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనుంది.