కొత్తగూడెం అర్బన్, మార్చి 19: కొత్తగూడెంలోని క్లబ్లో శనివారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు అనూహ్య స్పందన లభించింది. ఈ షో లో కొత్తగూడెం, సుజాతనగర్, పాల్వంచతో పాటు ఖమ్మం, హైదరాబాద్‌లకు చెందిన 22 రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, బ్యాంకర్లు స్టాళ్లు ఏర్పాటు చేసి స్థలాలు, ఇండ్ల కొనుగోలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. తొలిరోజు ప్రాపర్టీ షోను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్రాపర్టీ షో కు డివైన్ హోమ్స్ శ్రీనివాస హైట్స్, శ్రీబాలాజీ ఎస్టేట్ మెయిన్ స్పాన్సర్స్‌గా, శ్రీజయవిలాసిని అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించాయి. షో లో శ్రీ సిటీ, సిక్త్స్ ఎలిమెంట్స్, గెలాక్సీ, వీఎంఆర్ ప్రైమ్ ఇన్ఫ్రా, ఎస్కేటీ, సప్తవర్ణ, మాన్వి కన్స్ట్రక్షన్స్, తాటిపల్లి ఇన్ఫ్రా, నెల్లూరి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, సమూహ ప్రాజెక్ట్ లిమిటెడ్, పెన్నా సిమెంట్, మార్వెల్ హోమ్స్, ఆదిత్య బిల్డర్స్, గూగీ ప్రాపర్టీస్ పాల్గొన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు గిఫ్ట్ పార్టనర్స్‌గా టీ న్యూస్, నీలోఫర్ సంస్థలు వ్యవహరించాయి.
కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు దమ్మాలపాటి శ్రీనివాసరావు, కుంచవరపు రమేశ్‌బాబు, గరికపాటి విజయ్‌బాబు, ప్రేమ్‌సాయి, రాంబాబు, అరుణ్ చైతన్య, దోసపాటి వెంకటేశ్వరరావు, వి.నాగేశ్వరరావు, ఎల్లంకి నరేష్, తాటిపల్లి శంకర్‌బాబు, గోపీనాథ్, ఎస్కే అజ్జు, శ్రీనివాస్, చావా రమణ, కనుకుంట్ల కుమార్, రామకృష్ణారెడ్డి, నమస్తే తెలంగాణ డీజీఎం రాజిరెడ్డి, బ్రాంచి మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, ఎడిషన్ ఇన్చార్జి కాయల పూర్ణచందర్రావు, అడ్వైర్టెజ్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, స్టాఫ్ రిపోర్టర్ కాగితపు వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు పరమేశ్, లక్ష్మణ్, ప్రసాద్‌బాబు, మోరె రూప, కంచర్ల జమలయ్య, టీఆర్ఎస్ నాయకులు రజాక్, మాదా శ్రీరాములు, మోరె భాస్కర్‌రావు, యూసుఫ్, అన్వర్‌పాషా, ఉప సర్పంచ్ లగడపాటి రమేశ్ పాల్గొన్నారు.
నేడు ముగింపు కార్యక్రమం..
రెండోరోజు ఆదివారం జరుగనున్న ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.
ప్రజల సందేహాలు నివృత్తి..
పట్టణాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. పట్టణ శివారు ప్రాంతాలు పట్టణాల్లో కలిసిపోతున్నాయి. పట్టణాల్లో ప్రాపర్టీస్ ఉండాలని గ్రామీణ ప్రాంతవాసులూ కోరుకుంటున్నారు. కానీ వారికి అనేక సందేహాలు, అనుమానాలు. ఎక్కడ ప్రాపర్టీ కొనాలి? ఎక్కడ స్థలం కొనాలి ? ఎవరిని సంప్రదించాలి ? ప్లాటు కొనాలంటే ఏయే జాగ్రత్తలు పాటించాలి ? ఇండ్లు కొనాలంటే ఏయే ప్రమాణాలు తెలుసుకోవాలి? అనే విషయాలపై ఎక్కువమందికి ప్రాథమిక అవగాహన అయినా ఉండదు. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నది. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, బిల్డర్లు, వెంచర్ల యజమానులు, బ్యాంకర్లు స్టాళ్ల వద్ద అందుబాటులో ఉండి షోకు వచ్చిన వారికి అవగాహన కల్పిస్తున్నారు
రియల్టర్లు ప్రజల నమ్మకం పొందాలి..: కలెక్టర్ అనుదీప్
రియల్టర్లు ప్రజలకు డీటీసీపీ అప్రూవల్స్ ఉన్న అపార్ట్మెంట్లు, ఇండ్లు, స్థలాలను విక్రయించి వారి నమ్మకాన్ని పొందాలని కలెక్టర్ అనుదీప్ కోరారు. ప్రజల అభిమనాన్ని చూరగొనాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మంచి ప్రాపర్టీస్ అందించాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంచర్లు ఏర్పాట చేయాలన్నారు. ఇండ్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలన్నారు. భద్రాద్రి జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తున్నదన్నారు. పట్టణాల విస్తరణ నానాటికీ పెరుగుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ యాజమాన్యాలకు అభినందనలు తెలిపారు.
రియల్ ఎస్టేట్‌కు పూర్తి సహాయ సహకారాలు:కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోను ఆయన సందర్శించి మాట్లాడారు. నియోజకవర్గంలో భవనాల నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు దగ్గరుండి పరిష్కరించానన్నారు. తన హయాంలో వందలాది నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయన్నారు. రియల్టర్లు పక్కా నిబంధనలతో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చిన పత్రికల యాజమాన్యాలకు అభినందనలు తెలిపారు. అనంతరం ‘నమస్తే’ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, కనుకుంట్ల కుమార్, పల్లపు లక్ష్మణ్, ఎంఏ రజాక్, వాసు పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్‌కు మంచి రోజులు..
భద్రాద్రి జిల్లాలో రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. కొత్తగూడెం, సుజాతనగర్, పాల్వంచ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్ కల్చర్ మొదలైంది. రానున్న రోజుల్లో ఇది మరింతగా విస్తరించే అవకాశం ఉంది. ఇక్కడ కేటీపీఎస్, నవభారత్, సింగరేణి, హెవీ వాటర్‌ప్లాంట్‌లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు, గతంలో ఉద్యోగులంతా హైదరాబాద్, ఖమ్మంలో కొనేందుకు ఆసక్తి చూపేవారు.
– దమ్మాలపాటి శ్రీనివాసరావు, శ్రీశ్రీనివాస హైట్స్ అధినేత
ఇలాంటి షోలు మరిన్ని అవసరం..
కొత్తగూడెం జిల్లాకేంద్రం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. పట్టణంలో ఇలాంటి ప్రాపర్టీ షోలు మరిన్ని జరగాలి. ఒకేవేదికపై రియల్ఎస్టేట్ రంగంపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నాం. ఇల్లు కొన్న వినియోగదారుడు సరాసరి ఇంట్లో గృహప్రవేశం చేసి పాలు పొంగించుకునేలా నిర్మాణాలు చేపట్టాం. – శ్రీనివాసరాజు,
మార్కెటింగ్ మేనేజర్, శ్రీబాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్‌స్ట్రక్షన్స్
కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా..
ఇల్లు నిర్మించడం, విక్రయించడం కష్టంతో కూడుకున్న పని. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా అపార్ట్మెంట్స్, విల్లాలు నిర్మిస్తున్నాం.. ఇలాంటి ప్రాపర్టీ షోలు మరిన్ని జరిగితే రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుంది.
– ఖాజా, మేనేజర్, జయవిలాసిని డెవలపర్స్