కరకగూడెం, మే 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తుడుందెబ్బ నూతన కమిటీని శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ సమక్షంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనానాయణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరకగూడెం మండలం తుడుందెబ్బ అధ్యక్షుడిగా కలం సంపత్ కుమార్, ఉపాధ్యక్షులుగా పోలెబోయిన రాంగోపాల్, కోరగట్ల విశ్వనాథం, ప్రధాన కార్యదర్శిగా తోలెం హరికృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు పోలెబోయిన సర్వేశ్వరరావు, అధికార ప్రతినిధిగా పోలెబోయిన నరేష్, కోశాధికారిగా చందా గణేష్ తో పాటు కార్యదర్శులుగా పోలెబోయిన నారాయణమూర్తి, రాజశేఖర్, రఘు, పాయం సుధాకర్, కంగాల నరేష్, ఈసం రాజబాబు, కొమరం కళ్యాణ్, సోలం నాగరాజు, చందా విజయలక్ష్మీ, వజ్జా అపర్ణతో పాటు మరికొంత మంది సభ్యులను సాంస్కృతిక, ప్రచార, సోషల్ మీడియా, గౌరవ సలహాదారులు, కార్యవర్గ సభ్యులుగా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకన్నారు. ఎన్నికైన కమిటీ సభ్యులు ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఎల్లవేళలా పాటుపడతామని పేర్కొన్నారు.

తుడుందెబ్బ నూతన కమిటీ ఎన్నిక