– బూర్గంపహాడ్ ఎంపీడీవో జమలారెడ్డి
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 09 : ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలని చాటిన మానవతావాది, ప్రజాకవి, ఉద్యమ కెరటం కాళోజీ నారాయణరావు అని బూర్గంపహాడ్ ఎంపీడీవో కుడుముల జమలారెడ్డి అన్నారు. బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బూర్గంపహాడ్ మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణానికి కవిగా తెలంగాణ ప్రజలకు బాష, యాసను తెలియజేసిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా హనుమకొండ జిల్లాలో కాళోజీ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని, ఇలాంటి గొప్ప వ్యక్తుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూడీసీ పద్మావతి, మండల పరిషత్, ఉపాధి హామీ, ఎంఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.