రామవరం, అక్టోబర్ 17 : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు ఆదేశానుసారం డబ్ల్యూపిఎస్ & జిఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) ఆధ్వర్యంలో కబడ్డీ రీజనల్ మీట్ పోటీలు రుద్రంపూర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీవైపీఎం జి.హరీష్ (హానరరీ సెక్రటరీ), ఏఐటీయూసీ ప్రతినిధి బి.వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవైపీఎం జి.హరీష్ మాట్లాడుతూ.. క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. రీజనల్ లెవెల్ లో ప్రతిభ కనబరిచిన వారిని కంపెనీ లెవెల్, కోల్ ఇండియాలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పొర్ట్స్ కో- ఆర్డినేటర్ భూక్యా భీముడు పాల్గొన్నారు.