ఇల్లెందు, జూన్ 21 : తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి ఈ ప్రాంత ప్రజలను జాగృత పరిచి, రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ అన్నారు. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా శనివారం ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమ సీనియర్ నాయకుడు సిలివేరి సత్యనారాయణ, ఇల్లెందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్ రావు, మండల మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర్ భవుసింగ్ నాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, మహమ్మద్ అబ్దుల్ జబ్బార్, సోషల్ మీడియా & యువజన విభాగం గిన్నారపు రాజేశ్, సాతల హరికృష్ణ, కాసాని ప్రసాద్ యాదవ్, సన రాజేశ్, పట్టణ యువజన నాయకులు ఎస్.కె చాంద్ పాషా, మునిగంటి శివ, తెలంగాణ ఉద్యమ నాయకులు డేరంగుల పోశం, రామ్ లాల్ పాసి, లలిత్ కుమార్ పాసి, మండల మాజీ కో ఆషన్ సభ్యులు ఎస్.కె గాజి, ఎండి గౌస్, వార రమేశ్, పరికపెళ్లి రవి, దుంపటి కృష్ణయ్య, బజారు సత్యనారాయణ, ఈర్ల శ్రీకాంత్, ఈదుల ముత్తయ్య పాల్గొన్నారు.