‘కార్మిక సమస్యలపై కనికరం లేని ఐటీసీ యాజమాన్యం’
కార్మిక సమస్యలపై ఐటీసీ యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా కనికరం లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్‌పాషా, బల్లెం నాగయ్య మండిపడ్డారు. మంగళవారం..
బూర్గంపహాడ్, ఏప్రిల్ 28 : కార్మిక సమస్యలపై ఐటీసీ యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా కనికరం లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్‌పాషా, బల్లెం నాగయ్య మండిపడ్డారు. మంగళవారం 34వ రోజుకు రిలే నిరాహార దీక్షలు చేరుకోవడంతో దీక్షలకు బీఆర్టీయూ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కుందూరు పెద్దిరెడ్డి, ఐఎన్టీయూసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఉర్లుగొండ వీరన్న కార్మికులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలపై ఎండను సైతం లెక్కచేయకుండా నెలరోజులకు పైగా దీక్షలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు. కార్మిక సమస్యలపై జేఏసీ పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని, మున్ముందు కార్మికుల ఆగ్రహానికి యాజమాన్యం గురికాక తప్పదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం కానుందని హెచ్చరించారు. దీక్షలో జేఏసీ నాయకులు చుక్కపల్లి బాలాజీ, సూరిశెట్టి జగదీష్, కందాల వెంకటరెడ్డి, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

