– ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఇల్లెందు, సెప్టెంబర్ 07 : అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అలిమి కానీ హామీలను ఇచ్చి ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం ఇల్లెందు ఎంపీడీవో కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ హామీల అమలుకై నిరసన కార్యక్రమం నిర్వహించి, ఫిర్యాదులు ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకై దరఖాస్తులు రాసుకొని ప్రజావాణి కార్యక్రమంలో తాసిల్దార్, కి ఎంపీడీవోకి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ… ఎన్నికల ముందు పేద ప్రజలను మభ్యపెట్టి ఆశ సూపి ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని మరిచి నాయకులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు ఏమి పట్టనట్టుగా స్వలాభం కోసం ప్రజలను గాలికి వదిలేసి తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన మేలులను ప్రజల హృదయాల్లో ఉన్నాయని, కాంగ్రెస్ వచ్చాక సంక్షేమాన్ని వదిలేసి రైతులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇల్లెందు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని వినతి పత్రాలు అందజేసిన వారిలో సీనియర్ నాయకులు ఎస్ రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, అబ్దుల్ నబి, మాజీ మండల అధ్యక్షుడు శీలం రమేష్, జెకె శ్రీను, ఘాజి, దేవీలాల్, ప్రమోద్, అజ్మీరా బావుసింగ్, సర్పంచ్ కుంజ సుకణయ్య, బీఆర్ఎస్ నాయకులు డేరంగుల పోశం, ధనలక్ష్మి, కొక్కు సరిత, భవాని, సునీల్, శ్రీకాంత్, హరి ప్రసాద్, ఉపేందర్, రామ్ లాల్ పాసి, లలిత పాసి, ఇమ్రాన్, చాంద్ పాషా, శ్రీను, రవి, పాషా, సత్తాల హరికృష్ణ, నీలం రాజశేఖర్, వసంతరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

‘అలిమి కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు’