రామవరం, ఏప్రిల్ 6 : శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులు భక్తులకు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రాకముందు దేవాలయాలలో భక్తులు కానుకలు హుండీలలో వేసేవారు. కానీ మారుతున్న మార్పుకు తగ్గట్టుగా ఆలయాలకు వచ్చే భక్తులు మారుతున్నారు. కానుకలు నగదు రూపంలో చెల్లించడానికి తమ వద్ద లేకపోవడంతో నిరాశ చెందుతున్నారని గ్రహించి ఆలయ సిబ్వాబంది వారి సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
తాజాగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ శ్రీశ్రీ సీతారామ దేవాలయ సంస్థానంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని భక్తుల సౌలభ్యం కోసం వారు కానుకలు(పైసలు) చెల్లించేందుకు ప్రతిచోట క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు తమకు అందుబాటులో ఉన్న ప్రాంతంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి కానుకలు చెల్లిస్తున్నారు. దీంతో భక్తులు సంతోషంగా దైవ దర్శనం చేసుకొని తిరుగుముఖం పడుతున్నారు.