‘ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి’
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ ముడు గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బస్టాండ్ సెంటర్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన..
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఏప్రిల్ 14 : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ ముడు గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బస్టాండ్ సెంటర్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల దీక్ష శిబిరాన్ని వారు సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం లో భాగంగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన ఉపాధ్యాయ ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. ప్రజా సమస్యలు అయినా, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అయినా ఐక్య పోరాట ఉద్యమాలే పరిష్కారానికి మార్గం అన్నారు.
గత రెండు సంవత్సరాల నుండి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయం అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమం చరిత్రను మలుపు తిప్పిందని అటువంటి వారి సమస్యలు పరిష్కరించటానికి ప్రభుత్వం కాలయాపన చేయటం సరికాదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెస్లీ, కోటేశ్వర రావు, రిటైర్ పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, విద్యానగర్ సర్పంచ్ శాంతి శ్రీ ప్రసాద్, ఉప సర్పంచ్ మురళి, వెంకట్, కొత్తగూడెం జమలయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

‘ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

