హైదరాబాద్ : సెల్‌ఫోన్‌ను తరచూ చూడొద్దన్నందుకు ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ అఖిల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వరావుపేటకు చెందిన సంకుల పవన్ కుమార్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు.
వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన పవన్ అదే పనిగా సెల్ చూడొద్దని ఈనెల 7న తండ్రి రాజు మందలించడంతో మనస్థాపం చెందిన పవన్ గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు. తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.