– ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్
రామవరం, నవంబర్ 28 : సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల్లో క్రీడాకారులు కబడ్డీ ప్రాక్టీస్ చేసుకునేందుకు సింథటిక్ కోర్టులు ఏర్పాటు చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ నందు సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ వేడుకకు ఆయన హాజరై మాట్లాడారు. కబడ్డీ, హాకీ, క్రికెట్ లాంటి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఒకవేళ గాయపడితే వారికి యాజమాన్యం వేతనం ఆలస్యంగా చెల్లించడం వల్ల కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కావునా వారికి ప్రతి నెలా వేతనం యాజమాన్యం త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావు, జె.గట్టయ్య, వీరస్వామి, కత్తర్ల రాములు, సందబోయిన శ్రీనివాస్, మధు కృష్ణ, కమల్ పాల్గొన్నారు.