కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 23 : అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అర్హత లేని వారిని ఎంపిక చేస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సేవ్ కొత్తగూడెం – సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ హెచ్చరించారు. పట్టణంలోని పాత కొత్తగూడెంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 807 మందికి ఇంటి స్థలాలను మంజూరు చేసిందని, వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం ఇందిరాగాంధీ విగ్రహం ముందు స్థల లబ్దిదారులతో కలిసి కండ్లు మూసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడుత సర్వే పేరుతో అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నరసయ్య, రామయ్య, సరోజ నిరోశా, రాజా, హైమద్, సికిందర్, ఖాదర్, బన్సీ పాల్గొన్నారు.