ఇల్లెందు, ఫిబ్రవరి 14 : ఆదివాసి ముద్దుబిడ్డ, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు గౌరవ డాక్టరేట్ లభించింది. శనివారం చెన్నై, మైలాపూర్ భారతీయ విద్యా భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, నిబద్ధతైన సేవలు అందించినందుకు గాను యూనివర్సిటీ కమిటీ గుమ్మడి నరసయ్యను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సత్కరిస్తున్నట్లు పేర్కొంది. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా.గౌని నర్సింహ గౌడ్, నామినేషన్ కమిటీ మెంబర్ ఎండీ.అరిఫుద్దీన్ చేతుల మీదుగా గుమ్మడి నరసయ్య ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఇల్లెందుకు చెందిన పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకి గౌరవ డాక్టరేట్