హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్ ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నది. మొత్తం రెండు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించనుండగా, మొదటి విడత కౌన్సిలింగ్ 31 నుంచి, తుది విడత కౌన్సిలింగ్ ఆగస్టు 17 నుంచి నుంచి ప్రారంభంకానున్నాయి.
ఐసెట్ అడ్మిషన్స్ కమిటీ సమావేశాన్ని ఇటీవలే నిర్వహించగా.. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన సహా పలువురు ఉన్నతాధికారులు కౌన్సెలింగ్పై సమగ్రంగా చర్చించి, షెడ్యూల్ ఖరారుచేశారు. రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులు ఆగస్టు 22 నుంచి 25 వరకు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆగస్టు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను https ://tsicet. nic. in వెబ్సైట్లో విడుదలచేస్తామని ప్రకటించారు.