జూలూరుపాడులో హోమియో వైద్య శిబిరం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ఆరోగ్య జీవన యాత్ర - యోగా వాకింగ్ బృందం ఆధ్వర్యంలో..
జూలూరుపాడు, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ఆరోగ్య జీవన యాత్ర – యోగా వాకింగ్ బృందం ఆధ్వర్యంలో స్థానిక సాయి ఎక్స్లెంట్ స్కూల్లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి మండలంలోని పలు గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ల నొప్పులు, అలర్జీ, జలుబు, దగ్గు, ఆస్తమా, మైగ్రేన్ తలనొప్పి, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు, మహిళల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి, తగిన మందులతో పాటు విలువైన ఆరోగ్య సలహాలను అందించారు.
ఈ శిబిరంలో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రవికాంత్ రెడ్డి, రామారావు, జి.రాధాకృష్ణమూర్తి, శ్రీనివాసరెడ్డి, రఘునాథరావు, శ్రీధర్, టి.ఎస్.మూర్తి, రామ్మోహన్ రావు, వీరమల్లు కోటేశ్వరరావు, ధనలక్ష్మి, ప్రమద, మహేశ్వరి పాల్గొని రోగులకు ఉచిత సేవలు అందించారు. కార్యక్రమ విజయవంతానికి ఆరోగ్య జీవన యాత్ర సభ్యులు తిప్పర్తి శివ, వేల్పుల బోసు, ఇజ్జాడ మురళి, గుప్తా మురళి, పెండ్యాల నరేష్, సక్రు, సురేష్ సింగ్, బండ్ల వెంకట్, రిటైర్డ్ పీఈటీ సున్నం రామకృష్ణమాచారి తదితరులు పర్యవేక్షించారు.

జూలూరుపాడులో హోమియో వైద్య శిబిరం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

