రామవరం, జూలై 17 : ఎన్నికల సమయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు దాదాపు 50 రకాల వాగ్దానాలు చేశాయని, కానీ నేటి వరకు కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాయని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, జేబీసీసీ మెంబర్ రియాజ్ అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి జేవిఆర్ఓసి నందు హెచ్ ఎం ఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులను మోసం చేసి ఓట్లు దండుకున్న సంఘాలు కార్మికులకు లాబాదాయకమైన ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయాయన్నారు.
స్టాండర్డ్ మీటింగ్లో జరిగిన చర్చల గురించి వేజ్ బోర్డులో జరిగిన చర్చల గురించి, హెచ్ఎంఎస్ యూనియన్ చేపట్టే కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. అంతేకాకుండా సత్తుపల్లి డిస్పెన్సరీలో సమస్యలను తెలుసుకుని సీఎంఓ ని కలిసి మెమోరండం అందజేశారు, కిష్టారం ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ని కలిసి అక్కడ సమస్యలు వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. జీకే ఓసిలో హెడ్ ఓవర్ మెన్ గా పనిచేసే శ్రీనివాస్ ఇకనుంచి హెచ్ఎంఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, కార్మిక సంక్షేమం విషయంలో రాజీ లేకుండా పోరాటం చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, బ్రాంచ్ సెక్రెటరీ ఆసిఫ్, సత్తుపల్లి ఏరియా ఇన్చార్జి అజ్గర్ ఖాన్, కొత్తగూడెం ఏరియా మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి సాంబశివరావు, సెంట్రల్ కమిటీ మెంబర్ నసీం ఖాన్, జేవిఆర్ఓసి ఫిట్ సెక్రెటరీ శ్రీనివాస్, సమంత, సెక్రెటరీ నరసింహారావు, మహేశ్, కిష్టారం ఓసి సెక్రెటరీ మొగిలి, కొత్తగూడెం ఆర్ సి ఎస్ పి సెక్రెటరీ పూర్ణచందర్, వీకే వర్క్ షాప్ సెక్రటరీ కరీం, పి వి కే ఫై సెక్రెటరీ చిట్టిబాబు, ఏరియా బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వరానంద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలచందర్ రెడ్డి, ఓల్డ్ సి ఎస్ పి సెక్రెటరీ షకీల్, ప్రవీణ్, కనకారావు, మహేశ్, పవన్, రమేశ్, అలీమ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.