చుంచుపల్లి, జూన్ 27 : చుంచుపల్లి మండలంలోని ఐకేపీ కార్యాలయంలో సెర్ప్ దివ్యాంగుల సమ్మిళిత అభివృద్ధి ఆధ్వర్యంలో శనివారం హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీఓ పీడీ విద్యాచందన మాట్లాడుతూ.. హెలెన్ కెల్లర్ వైకల్యాన్ని జయించి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన మహనీయురాలన్నారు. దివ్యాంగుల హక్కులు, మహిళల సాధికారత కోసం ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆమె జీవితంలో ఉపాధ్యాయురాలు యాన్ సుల్లివన్ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెలెన్ కెల్లర్ జీవిత విశేషాలు, ఆమె సాధించిన విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నీలేష్, డీపీఎం సురేష్ రెడ్డి, ఏపీఎంలు ఎస్.డి.అహ్మదుల్లా, రాంబాబు, బి.రామకృష్ణ, జిల్లాలోని వివిధ మండలాల అధికారులు, దివ్యాంగులు, ఓబీఎస్లు పాల్గొన్నారు.