‘హరీశ్రావు అరెస్ట్ దురదృష్టకరం’
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్ రావు అక్రమ అరెస్టును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం..
– బీఆర్ఎస్ వైరా నాయకుడు లకావత్ గిరిబాబు
జూలూరుపాడు, జూలై 02 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్ రావు అక్రమ అరెస్టును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడడం తగదని, ఇప్పటికైనా ఇలాంటి కక్షసాధింపు చర్యలను వెంటనే మానుకోవాలన్నారు. బహిరంగ చర్చకు సవాళ్లు విసిరింది కాంగ్రెస్ నాయకులేనని, తాము చర్చకు సిద్ధమని ముందే ప్రకటించినప్పటికీ, వెనకడుగు వేసి పోలీసులతో అరెస్టులకు పాల్పడడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదని, ప్రజల సొమ్ము ఎలా ఖర్చవుతోంది, ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో నిలదీయడం ప్రతిపక్షంగా తమ ప్రాథమిక బాధ్యత అన్నారు. ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తించడానికి వెళ్లిన హరీష్ రావును అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే ప్రజా సమస్యలపై, తమ పాలనా నిర్ణయాలపై చిత్తశుద్ధి ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చేతనైతే బహిరంగ చర్చకు వచ్చి ఆధారాలతో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకుండా, పోలీసుల వెనుక దాక్కొని ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హితవు పలికారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

