Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Anant Singh | బీహార్లో అధికార కూటమికి చెందిన జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్, సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం నితీశ్ కుమార్ రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తొమ్మిది మంది హత్యలకు సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలిపారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయన మాటమార్చారు.
పాట్నా: బీహార్లో అధికార కూటమికి చెందిన జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్, సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం నితీశ్ కుమార్ రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తొమ్మిది మంది హత్యలకు సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలిపారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయన మాటమార్చారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై ఆ నిందను మోపారు. (Anant Singh) అక్టోబర్ 23న జరుగనున్న శాసన మండలి ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నీరజ్ కుమార్ను బరిలోకి దింపడంపై జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థిపై విరుచుకుపడుతూ కీలక ఆరోపణలు చేశారు. ‘నాకు, నితీశ్ కుమార్కు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆయనకు సహాయం చేయడానికి, నేను తొమ్మిది మందిని హత్య చేయించా. ఆయన రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో నేను అండగా నిలిచా’ అని అన్నారు.
కాగా, ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) దీనిపై స్పందించింది. అనంత్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ నేరాలను ఆయన అంగీకరించినట్లుగా ఉన్నాయని ఆరోపించింది. మోతిహారి, ముజఫర్పూర్, వైశాలి లేదా మోకామా ప్రాంతాలకు చెందిన నేరస్తుల ముఠాలతో చేతులు కలపడం ద్వారానే నితీశ్ కుమార్ ఎదిగారని ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ విమర్శించారు.
మరోవైపు విమర్శల నేపథ్యంలో అనంత్ సింగ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. మొత్తం నిందను లాలూపైకి నెట్టారు. ‘నీరజ్ కుమార్కు సమాధానమిస్తూ నేను చేసిన త్యాగాల గురించి వివరించా. లాలూ యాదవ్ ప్రభుత్వ హయాంలో నా అనుచరుల్లో తొమ్మిది మంది హత్యకు గురయ్యారు, నాపై కూడా కాల్పులు జరిగాయి. మేము నితీశ్ కుమార్కు మద్దతుగా నిలిచామన్న కారణంతోనే లాలూ యాదవ్ వారిని చంపించారు. మేము ఎంతో భారీ నష్టాలను చవిచూశాం. నా తండ్రి కూడా గుండెపోటుతో మరణించారు’ అని ఆయన అన్నారు.
అయితే అనంత్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ దూరంగా ఉన్నది. ఈ వ్యాఖ్యలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోదగ్గవి కావని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ తెలిపారు. ‘నితీశ్ కుమార్ ఎప్పుడూ స్వచ్ఛమైన రాజకీయ చరిత్రను కలిగి ఉన్నారు. నేరస్తులతో సంబంధాలు కలిగి ఉండటం, హింసకు పాల్పడటం లేదా మరే ఇతర ప్రతికూల కార్యకలాపాల్లో ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదు. ఈ వ్యాఖ్యలను మా పార్టీ ఏమాత్రం పట్టించుకోదు. ప్రజలు కూడా వీటిని సీరియస్గా తీసుకోరు’ అని ఆయన అన్నారు.
Patna, Bihar: When asked if he still supports his party, JD(U) MLA Anant Singh says, “…Who has made as many sacrifices as I have? Nitish Kumar was nothing back then; he used to roam around here and there. At that time, while being with Nitish Kumar, I got nine people murdered…”
— IANS (@ians_india) October 16, 2026
“(लालू सरकार में) नीतीश जी के चलते हमारे 9 लोग मारे गए थे…”- अनंत सिंह
(पिछले बयान में अनंत सिंह ने गलत तरीके से बोला है या लोगों ने गलत मतलब निकाल लिया है? वो खुद तय कीजिए… जिस न्यूज एजेंसी ने वो बयान शेयर किया, उसका कैप्शन भी देखिए.) https://t.co/YRDoPo3PRk
— Akshay Pratap Singh (@AkshayPratap94) October 16, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Anant Singh
- claims
- Got Killed
- JDU
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

