Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఈ ఘటను శుక్రవారం అర్ధరాత్రి 3.00 గంటల తర్వాత, జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలో జరిగింది. భారత్-పాక్ సరిహద్దు అయిన లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) వద్ద, కెరాన్ సెక్టార్లోని, జగ్మండ్ ఏరియాలో శనివారం వేకువఝామున ముగ్గురు, నలుగురు వ్యక్తులు రహస్యంగా ఇండియావైపు రావడాన్ని భారత భద్రతా దళాలు గుర్తించాయి.
ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. ఎల్వోసీ నుంచి సరిహద్దు దాటి ఇండియాలోకి వచ్చేందుకు తీవ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భారత భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో ఉగ్రవాదులు కూడా మన సిబ్బందిపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భారత ఆర్మీ ఎదురు కాల్పులు జరిపింది. వారిని గాలిస్తూ కాల్పులు జరపడంతో ఇద్దరు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, ఈ ప్రాంతం మొత్తం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది.
తీవ్రవాదులు అక్రమ చొరబాటుకు ప్రయత్నించారని, ఎన్కౌంటర్లో ఇద్దరు మరణించారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, ఈలోపు ఇంకా ఎవరైనా ఇండియాలోకి చొరబడ్డారా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈ కాల్పులు జరిగిన ప్రాంతం పర్వతాలతో కూడి, నిర్మానుష్యంగా ఉంది. అందువల్ల అక్కడ ఉగ్రవాదుల్ని గుర్తించడం, వెంటనే స్పందించడం కొంచెం కష్టమైన విషయం. అయినప్పటికీ, ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు అక్కడ దాక్కుని ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

