Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Vijayan: కేరళం విపక్ష నేత, మాజీ సీఎం విజయన్ ఇంటికి ఇవాళ ఈడీ అధికారులు సమన్ల నోటీసులు అతికించారు. సీఎంఆర్ఎల్తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో అక్టోబర్ 23వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులు తెలిపారు.
తిరువనంతపురం: కేరళం విపక్ష నేత, మాజీ సీఎం విజయన్(Vijayan) ఇంటికి ఇవాళ సమన్ల నోటీసును ఈడీ అతికించింది. సీఎంఆర్ఎల్తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో అక్టోబర్ 23వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులు తెలిపారు. వాస్తవానికి శుక్రవారమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆయనపై కేసు బుక్ చేశారు. ఇక శనివారం ఉదయం కొచ్చికి చెందిన ఈడీ అధికారులు తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్లో ఉన్న మాజీ సీఎం విజయన్ నివాసానికి వెళ్లారు. అయితే విజయన్కు సమన్లు అందాయన్న విషయాన్ని స్పష్టం చేయడం కోసమే ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అతికించినట్లు అధికారులు వెల్లడించారు.
తాము వెళ్లినప్పుడు ఇంట్లో విజయన్ లేరని అధికారులు చెప్పారు. సీనియర్ సీపీఐ నేత వీ శివన్కుట్టి అక్కడకు చేరుకుని ఈడీ అధికారులకు సమాధానం ఇచ్చారు. ఈడీ చర్యలను శివన్ కుట్టి తప్పుపట్టారు. కన్నూరులో జరుగుతున్న పార్టీ మీటింగ్లో విజయన్ ఉన్నారని, ఆయన పారిపోలేదని అన్నారు. నిందిత వ్యక్తి ఆచూకీ లేనప్పుడు ఇంటికి నోటీసులు అతికించవచ్చు కానీ, విజయన్ టూర్లో ఉన్న సమయంలో వచ్చి నోటీసులు అతికించడం సమంజసం కాదు అని శివన్కుట్టి అన్నారు.
విజయన్ కుమార్తె వీణకు కొచ్చిన్ మినరల్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ సుమారు 2.78 కోట్ల పేమెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మనుగడలో లేని ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ పేరుతో ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

