Cycle yatra | కరకగూడెం : పర్యావరణహితమే లక్ష్యంగా ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు సైకిల్‌పై బయలుదేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన గూడవల్లి కృష్ణ మణుగూరు ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ డిపో క్లర్క్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. అయితే పర్యావరణాన్ని ప్రేమించే కృష్ణ దగ్గర ప్రాంతాలకు సైకిల్‌పై వెళ్లాలని.. సుదూర ప్రాంతాలు అయితే బస్సు ట్రైన్ లో వెళ్లాలని అంటున్నాడు.
భావితరాలకు స్ఫూర్తినింపేందుకు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అంటున్నారు. శనివారం ఉదయం పాల్వంచ పట్టణం నుండి ప్రారంభమైన ఈ యాత్ర భద్రాచలం, మణుగూరు, కరకగూడెం మీదుగా సాగుతుండగా ఆ వ్యక్తిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. ఈనెల 26తో ముగియనున్న కుంభమేళాకు తాడ్వాయి, మేడారం, కాలేశ్వరం, అదిలాబాద్ జిల్లా మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు చేరుకుంటానని ఆయన తెలిపారు.
CM Revanth Reddy | బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి : ఎంఎం గౌడ్
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు