రుద్రంపూర్, జూన్ 20 : కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో మాస్టర్ ఇ. కే.ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ సేవ యజ్ఞం నిర్వహించారు. శనివారం నాగయ్యగడ్డలోని లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గ్రామ సేవ యజ్ఞంలో మాస్టర్ ఇ.కే ఆధ్యాత్మిక సేవా సంస్థ కొత్తగూడెం బ్రాంచ్ ఫౌండర్లలో ఒకరైన రవిచంద్ర ఆధ్వర్యంలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ వెంకటేశ్వర్లు దంపతులతో గ్రామ సేవ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయంలో రామవరం వాసులకు వారి వారి శరీర రుగ్మతులను బట్టి కేస్ షీట్ (జబ్బుకు సంబంధించిన పత్రం )వివరంగా తాయారు జేసీ జబ్బులను బట్టి వారి దీర్ఘకాలిక శారీరక రుగ్మతులను బట్టి ఉచిత హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ ఆరోగ్య నికి ఔషధ సేవ ముఖ్యం కాదు ,ఆరోగ్యమునకు మూలము సరియైన ఆహారము, విహారము అని మనం తోటి వ్యక్తులతో అలాగే ప్రకృతితో వ్యవహరించే తీరు మన ఆరోగ్యానికి మూలమవుతుంది.
కాబట్టి అందరూ కూడా వారి, వారి ఆహార వ్యవహారాలను, ప్రవర్తనను సరిచేసుకున్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ,ఆనందంగా ఉండగలరు ఆయన అన్నారు. ఆ తర్వాతే ఔషధ సేవ అని పేర్కొన్నారు. అనంతరం 100 మంది పేషంట్లకు ఉచిత హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మాస్టర్ ఇ. కే ఆధ్యాత్మిక సేవా సంస్థ సభ్యులు జి లత ,ఆర్ రామారావు, కె శ్రీనివాసరెడ్డి, కె స్వామి, సౌజన్య, వీరమల్లు ,పి శ్రీధర్‌రావు ,బి కోటేశ్వరరావు ,కె కమల , నాగేశ్వరరావు, బి.వి చారి ,ఎస్ మనోహర్ కుమార్, కే.శ్రీనివాస్, ఎండి ఫజల్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ నిర్వాహకులు ఫణి కుమార్ ,పితాని అబ్బులు ,జూపాక రమేష్, నజీర్ ,పాటి మోహన్ పాల్గొన్నారు.

ఘనంగా గ్రామ సేవా యజ్ఞం