ఇల్లెందు రూరల్, డిసెంబర్ 23: సింగరేణికి పుట్టినిల్లయిన బొగ్గుట్టలో సింగరేణి 133వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. స్థానిక జేకే కాలనీలోని సింగరేణి స్కూల్లో స్టాల్స్‌ను ఎమ్మెల్యే హరిప్రియానాయక్, ఏరియా జీఎం శాలెం రాజు ప్రారంభించారు. సింగరేణి డే శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, సింగరేణి అధికారులు మల్లారపు మల్లయ్య, శ్రీనివాస్, బొల్లం వెంకటేశ్వర్లు, జివి.మోహన్‌రావు, గుర్తింపు సంఘం అధ్యక్షుడు ఎస్.రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి స్టేడియంలో..
మణుగూరు టౌన్, డిసెంబర్ 23: సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మణుగూరు పీవీ కాలనీలోని భద్రాద్రి స్టేడియంలో శుక్రవారం ఏరియా మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి సింగరేణి పతాకాన్ని ఎగురవేశారు. స్టేడియం వద్ద సింగరేణి రన్ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో పురోభివృద్ధిని సాధిస్తున్న సింగరేణి సంస్థ ఇతర రాష్ర్టాలకు కూడా విస్తరిస్తూ విద్యుత్ ఉత్పాదక రంగంలో సత్తా చాటుతుందన్నారు. స్టేడియంలో డిపార్ట్మెంట్, సింగరేణి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని, స్టాల్స్‌ను జీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం లలిత్‌కుమార్, సింగరేణి అధికారులు నాగేశ్వరరావు, ఫ్రిజ్లార్డ్, వెంకటేశ్వర్లు, వెంకటరమణ, రజాక్పాషా, లక్ష్మిపతిగౌడ్, శ్రీనివాసచారి, వెంకట్రావు, ఎస్.రమేష్, వి.ప్రభాకర్‌రావు, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు లేడీస్క్లబ్ సభ్యులు, సేవాసభ్యులు, ఉద్యోగులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.