జూలూరుపాడు, మార్చి 17 : గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి యదులాపురం గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలంలోని పంచాయతీ కార్మికులతో కలిసి సోమవారం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీల్లో విధులు నిర్వహించే కార్మికుల వేతనాలను ప్రతి నెల చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో వారితో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి బానోతు ధన్వంతరరావు, మండల నాయకులు, కార్మికులు తంబర్ల లచ్మీ, వినోద్, రాంబాబు, నాగు, నరేశ్, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, నర్సింహారావు, శేవ్యా పాల్గొన్నారు.