బూర్గంపహాడ్, ఏప్రిల్ 11 : వృద్ధురాలిని బెదిరించి మెడలోని బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించి పరారైన సంఘటన శనివారం బూర్గంపహాడ్ మండలంలోని జింకలగూడెం సమీపంలో చోటుచేసుకుంది. పాల్వంచ సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కుక్కునూరు మండలం వేలేరుకు చెందిన వృద్ధురాలిని ఏపీలోనే ఏ కొండూరు మండలం ఏ కొండూరు తండాకు చెందిన మురళినాయక్ అనే వ్యక్తి తన స్నేహితుడైన కొప్పుల వెంకటేశ్వర్లుతో కలిసి బైక్‌పై వచ్చి బూర్గంపహాడ్‌లో ఉచితంగా బియ్యం, గోధుమపిండి ఇప్పిస్తామని చెప్పి వాహనంపై ఎక్కించుకుని జింకలగూడెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో ఆమెను బెదిరించి మెడలో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు వెండి ఆభరణాలు, రూ.3 వేల నగదు, సెల్‌ఫోన్ అపహరించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు బానావత్ మురళీనాయక్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి బంగారు ఆభరణాలు, చెవి దిద్దులు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు కొప్పుల వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.