రామవరం, ఆగస్టు 22 : పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో గణేష్ నవ రాత్రులను జరుపుకోవాలని టూ టౌన్ సీఐ ప్రతాప్ నిర్వాహకులకు సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలన్నారు. policeportal.tspolice.gov.in వెబ్ సైట్ ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
మండపాల్లో ఎట్టి పరిస్థితులోను డీజేలను ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100 గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ కిశోర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.