కొత్తగూడెం అర్బన్, జూన్ 16 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని న్యూ గొల్లగూడెంలో రోడ్డు పనులకు మాజీ కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి సోమవారం శంకుస్థాపన చేశారు. వార్డులోని శివాలయం వెనుక నుండి చర్చి వరకు, షరీఫ్ ఇంటి వద్ద నుండి మున్సిపల్ పంచాయతీ చివరి వరకు కొత్త డ్రైన్ నిర్మాణ పనులకు పూజ కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు కౌన్సిలర్ మాచర్ల శ్రీనివాస్, వీరమ్మ, బంటి, విశ్వాస్, రాజగోపాల్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.