ఇల్లెందు, మే 01 : ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె కేక్ కట్ చేసి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఆధ్వర్యంలో మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఖమ్మం అధ్యక్షుడు భాస్కర్ పవార్ మొక్క నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధిలో పార్టీ విధానపరమైన పనుల్లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన కేసీఆర్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, జెకె శ్రీను, దేవీలాల్, మున్సిపల్ కౌన్సిలర్ పాబోల్ స్వాతి, మాజీ కౌన్సిలర్ తోట లలిత శారద, సర్పంచులు కుంజ సుకనయ్య, శంకర్, ప్రమోదు, రేణుక, నెమలి ధనలక్ష్మి, కొక్కు సరిత. నాయకులు చాంద్ పాషా, హరి ప్రసాద్ యాదవ్, గిన్నార రాజేష్, సత్తాల హరికృష్ణ, లక్ష్మీనారాయణ, కిరణ్, రాజు, నీలం రాజశేఖర్, భూక్య సురేష్, నివాస్, సురేష్ పాల్గొన్నారు.

మొక్క నాటిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్