Singareni Name Boards | కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 12 : సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా సెక్యూరిటీ విభాగంకు సంబంధించిన పర్మినెంట్ నేమ్ బోర్డును తొలగించి కార్మిక సంఘ నాయకులు ఫ్లెక్సీలను కట్టినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. వివరాల్లోకి వెళితే సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని సెక్యూరిటీ విభాగం సివిల్ డిపార్ట్మెంట్ కార్యాలయాలకు సంబంధించిన పర్మినెంట్ నేమ్ బోర్డులను తొలగించి ఐఎన్టీయుసిఏఐటియుసి కార్మిక సంఘాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ కార్మిక సంఘాలు న్యూ ఇయర్, సంక్రాంతి పండుగకు సంబంధించిన శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పుడు అడ్డుగా ఉన్నాయని ఎస్అండ్ పిసిజిఎం ఆఫీసును సూచించే పర్మినెంట్ బోర్డును తొలగించి కార్మిక సంఘాల నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలలో భాగంగా సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కార్మిక సంఘాలు కుల సంఘాలకు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారు.
హెడ్ ఆఫీస్కు కూత వేటు దూరంలో ఉన్నా..
హెడ్ ఆఫీస్కు కూత వేటు దూరంలో ఉన్నా సెక్యూరిటీ విభాగం సివిల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆఫీసులను సూచించే నేమ్ బోర్డులను తొలగించి కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను తొలగించకపోవడం అధికారులకు వారిపై ఉన్న అమితమైన ప్రేమకు నిదర్శనం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కార్మిక సంఘాల ఫ్లెక్సీలను తొలగించి ఎస్అండ్ పిసి పర్మినెంట్ బోర్డులను ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు.
సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోతుందని రాజకీయ నాయకులు చెప్పిన విధంగానే అధికారులు వింటూ డైరెక్టర్లతోపాటు జిఎంలను, సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లనే ఎస్ అండ్ పిసి డిపార్ట్మెంట్లో ఫ్లెక్సీలు తొలగించలేదని పర్మినెంట్ నేమ్ బోర్డ్ ను తొలగించినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కార్మికులు వాపోతున్నారు.
సింగరేణి సంస్థలో ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరించడానికి సంస్థ సి అండ్ ఎండి బలరాం ఉదాసీన వైఖరి ముఖ్య కారణమని మేధావి వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆయన సీరియస్ గా సంబంధిత అధికారులకు నిబంధనలు పాటించాలని సూచిస్తూ ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరిస్తే తప్ప సింగరేణి పరువు మర్యాద నిలబడుతుందని అభిప్రాయపడుతున్నారు.
లేకుంటే సింగరేణి చరిత్రలో లేనివిధంగా రాజకీయ జోక్యం మితిమీరి అధికారులు తీవ్ర ఇబ్బందులు పడడంతోపాటు కార్మికులు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా ఉండడం వల్ల సంస్థకు తీవ్ర నష్టం చేకూరుతుందని వాపోతున్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Maha Kumbh Mela | మాఘ పౌర్ణమి.. 1.83 కోట్ల మంది పుణ్యస్నానాలు