భద్రాద్రి కొత్తగూడెం, జూలై 17 : విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న కారుణ్య నియామక పథకం ఆర్థిక భరోసాను కల్పిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కారుణ్య నియామకం కింద ఇద్దరు అర్హులైన అభ్యర్థులకు కార్యాలయ సహాయకులుగా (ఆఫీస్ సబార్డినేట్లు) నియామక పత్రాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ రాజ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు డ్పీ సీఈఓతో పాటు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసి, నియామకం పొందిన అభ్యర్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి దేవేందర్, సంఘ సభ్యుడు విజయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.