– రూ. 10 వేల నగదు, క్వింటా 75 కిలోల బియ్యం అందజేత
జులూరుపాడు, మే 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండ్లరేవు పంచాయతీ రాంపురంతండాకు చెందిన మాలోత్ పడితిలాల్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో శనివారం ఆయన కుటుంబాన్ని గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు పరామర్శించారు. పడితిలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ పడితిలాల్ భార్య జ్యోతికి రూ.10 వేల నగదు, క్వింటా 75 కిలోల బియ్యాన్ని సర్పంచ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోత్ రామకృష్ణ, మాజీ సర్పంచ్ బోడా కృష్ణ, స్థానిక నాయకులు బాడావత్ యలమంద, భూక్యా రవి, బానోత్ రాంచంద్, మాను, హరిలాల్ పాల్గొన్నారు.