రుద్రంపూర్, ఏప్రిల్ 21 : సంపాదనలో ఒక భాగాన్ని పేదవారికి ఇవ్వడం ప్రతి సామర్థ్యమున్న ముస్లింకి విధిగా ఖురాన్ పేర్కొంటుంది. ఇది పేదవారి హక్కుగా భావించబడుతుందని జమాతే ఇస్లామిక్ హింద్ సభ్యుడు అబ్దుల్ బాషీద్ అన్నారు. మంగళవారం రుద్రంపూర్–రామవరం శాఖ, రామవరం మర్చంట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఓ మానవతా కార్యక్రమం నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం గ్రామానికి చెందిన ఓ పేద ముస్లిం యువతి పెళ్లి కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి రామవరం మర్చంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జాకీర్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామిక్ హింద్ సభ్యుడు అబ్దుల్ బాషీద్ మాట్లాడుతూ ఖురాన్, హదీస్లలో పేదవారికి ఇచ్చిన హక్కులను వివరించారు. ఈ కార్యక్రమంలో నజీర్, జాకీర్, జమాత్ సభ్యులు ఆలం, రహీం, మన్నన్, షమీం పాల్గొన్నారు.